VIDEO: గార్ల మండలంలో కురిసిన భారీ వర్షం
MHBD: గార్ల మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సోమవారం ఈదురుగాలితో కురిసిన భారీ వర్షంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ కావడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడగా, అకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కోతకు సిద్ధం ఉన్న వరి పంట, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి.