చిన్నారి వైద్యానికి లిటిల్ సోల్జర్స్ టీమ్ ఆర్థిక సాయం

NLG: నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ టీం చిన్నారి పాప చికిత్సకు సాయం అందించి పెద్ద మనస్సు చాటుకుంది. జనగామ జిల్లా ఘాన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన దీకొండ ప్రభాకర్ – అనూషల కూతురు ప్రణవి రోజు డయాలసిస్‌తో HYDలోని LBనగర్ అంకుర హాస్పిటల్ చికిత్స పొందుతుంది. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని శనివారం ఆస్పత్రికి వెళ్లి చికిత్సకు రూ.22వేలు సాయం అందించారు.