క్షేత్రస్థాయిలో పనులను గుర్తించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

క్షేత్రస్థాయిలో పనులను గుర్తించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులను క్షేత్రస్థాయిలో గుర్తించిన తరువాతే ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత అధికారులతో అమ్మ పాఠశాలలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గౌతమి తదితరులు పాల్గొన్నారు.