రహదారులు అధ్వానం.. ప్రజల ఇబ్బందులు

రహదారులు అధ్వానం.. ప్రజల ఇబ్బందులు

BDK: చండ్రుగొండ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. గానుగపాడు, పోకలగూడెం, తుంగారం, బాల్యతండాతో పాటు మొత్తం 14 పంచాయతీల్లో రోడ్లు బురదమయంగా మారి, ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రావికంపాడులో వరి పొలంలా మారిన రోడ్డుపై నిలబడి ఓ మహిళ నిరసన వ్యక్తం చేయడం స్థానిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది.