నరసాపురంలో బాల్య వివాహాలపై ఆవగాహన

నరసాపురంలో బాల్య వివాహాలపై ఆవగాహన

W.G: బాల్య వివాహాలపై బుధవారం నరసాపురం లెనిన్ మిషన్ హై స్కూల్‌లో ఐసీడీఎస్ (ICDS) ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నతనంలో వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు సూపర్వైజర్ పద్మావతి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల హక్కులు, విధులు, మహిళా చట్టాలు, కిశోర బాలికలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు.