శ్రీ నందీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
KDP: వేంపల్లె మండలం నందిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ నందీశ్వరాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నంద్యాల మురళీ శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమ అర్చన పూజలు చేశారు. పుష్పాలు, వివిధ రకాల అలంకరణ సామగ్రితో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.