జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

SRCL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు తేలికపాటి వర్షాలు కురిశాయి. వేములవాడ గ్రామీణ మండలంలోని వట్టెంలలో అత్యధికంగా 8.5 మి.మీల వర్షపాతం నమోదు కాగా, ముస్తాబాద్‌లో 4.8 మి.మీ, గంభీరావుపేటలో 3.3 మి.మీ, బోయినపల్లిలో 2.5 మి.మీల వర్షపాతం రికార్డైంది. మిగతా మండలాల్లో 0.5 నుంచి 2.3 మి.మీల వరకు వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు తెలిపారు.