గిరిజనులకు లయన్స్ క్లబ్ సహాయం

గిరిజనులకు లయన్స్ క్లబ్ సహాయం

MDK: హవేలి ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా వాసులకు మంజీరా లయన్స్ క్లబ్ నిత్యవసర వస్తువులను అందజేసింది. పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తాండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యవసర వస్తువులు, బట్టలు నీట మునిగి పోయాయి. మంజీరా లయన్స్ క్లబ్ మంగళవారం తండావాసులకు నిత్యావసర వస్తువులను అందజేసింది. తమను ఆదుకోవాలని తండావాసులు ప్రభుత్వాన్ని కోరారు.