BREAKING: 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి

పాకిస్తాన్ అర్థరాత్రి మరోసారి డ్రోన్ల దాడికి దిగింది. J&K సరిహద్దు ప్రాంతాల్లోని 26 చోట్ల డ్రోన్లతో రెచ్చిపోగా.. భారత్ వాటిని ధీటుగా తిప్పికొట్టింది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్ము, సాంబా, పఠాన్ కోట్, అమృత్ సర్, ఫిరోజ్‌పూర్, హోషియార్ పూర్, గురుదాస్ పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఇండియన్ ARMY, డిఫెన్స్ మినిస్ట్రీవర్గాలు వెల్లడించాయి.