ఒంటిమిట్ట ఎస్సైగా శ్రీనివాసులు బాధ్యతలు
కడప: ఒంటిమిట్ట మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు.