బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు: ఎమ్మెల్యే సింధూర

బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు: ఎమ్మెల్యే సింధూర

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొనియాడారు. బాలయ్య పౌర సన్మాన సభలో ఆమె మాట్లాడారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో ఆయన అందిస్తున్న సేవలు ఎనలేనివని తెలిపారు. తమ అత్తమ్మకు అందులో చికిత్స అందించామని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం బాలయ్యకే సాధ్యమని తెలిపారు.