పులివెందులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉన్న జయమ్మ కాంప్లెక్స్‌లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి జయమ్మ కాంప్లెక్స్‌లోని తోపుడు బండిపై రాత్రి పడుకోగా.. ఉదయం చూస్తే చనిపోయారని స్థానికులు తెలుపుతున్నారు. మృతుడు వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.