80 వేల విలువైన వెండి వస్తువులు మాయం
NLR: దగదర్తి మండలం అనంతవరం గ్రామంలో ఎన్నారై అడపా పవన్ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి దాదాపు రూ.80 వేల విలువైన వెండి వస్తువులను దోచుకెళ్లినట్లు భాదితుడు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మండల జనసేన అధ్యక్షులు వెంకట్ యాదవ్ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఘటన స్థలానికి చేరుకుని ఇంటిని తనిఖీ చేశారు.