ఇబ్రహీంపట్నంలో 31,835 మంది ఓటర్లు

ఇబ్రహీంపట్నంలో 31,835 మంది ఓటర్లు

RR: ఓటరు తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని 14 గ్రామపంచాయతీలు, 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. మొత్తం 31,835 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 144, ఎంపీటీసీ పరిధిలో 58 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పురుషులు 15,780 మంది, మహిళలు 16,053 మంది, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.