నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం
GDWL: ప్రజలు ఆర్టీసీ సేవలు సౌకర్యాల గురించి సలహాలు, సూచనలు ఇచ్చి మరిన్ని సేవలు పొందాలని గద్వాల డిపో మేనేజర్ సునీత కోరారు. RTC సేవలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు బుధవారం 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ ద్వారా ప్రయాణికులు తమ సలహాలు తెలియజేయాలన్నారు.