డిండి ప్రాజెక్టులో వివక్ష.. సీపీఐ ఉద్యమం ప్రకటన
నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్షను నిరసిస్తూ సీపీఐ తీవ్రంగా స్పందించింది. ఈ అన్యాయాన్ని ఎండగట్టేందుకు భారీ ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ 1, 2 తేదీలలో సీపీఐ బృందం బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సందర్శించి వాస్తవాలను పరిశీలించనుంది.