'మున్సిపల్ పన్నులు నూరుశాతం వసూలు చేయాలి'
ప్రకాశం: మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను, ఖాళీ స్థలం, నీటి కుళాయిల పన్నులు నూరుశాతం వసూలు చేయాలని మున్సిపల్ కమీషనర్ కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ.. అధిక మొత్తంలో ఉన్న ఇంటి పన్ను బకాయి ఉన్నవారిని గుర్తించి పన్నులు వసూలు చేయాలన్నారు.