పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: పోలవరం పరివాహక ప్రాంతంలోని గోదావరి తీరానికి పెద్దపులి చేరడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలం పూడిపల్లి సమీపంలో పులి కదలికలను అటవీ అధికారులు ట్రాక్ చేశారు. ప్రస్తుతం నిర్వాసిత ప్రాంతాల్లో పశువుల మందలు ఆరుబయట ఉండటం, పొలాల్లోకి వెళ్లే రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.