VIDEO: 'పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతం చేయండి'
ప్రకాశం: కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని ఎంఈవో సుబ్బారావు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 5న జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్, హెచ్ఎంలు పాల్గొన్నారు.