'సంపూర్ణ అక్షరాస్యతకు సహకరించండి '

NLR: కొడవలూరు పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో భాగంగా అక్షరాస్యత వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అక్షరాంధ్ర నోడల్ ఆఫీసర్ మస్తాన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని సంపూర్ణ అక్షరాస్యతగా తీర్చిదిద్దాలన్నారు.