నేడు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవం

నేడు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవం

ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నందు బుధవారం ఉదయం 11 గంటలకు నూతన బస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ హసీనా బేగం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.