వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

వక్తృత్వ పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

GNTR: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ వక్తృత్వ పోటీల పోస్టర్లను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు మార్చి 4 నుంచి ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరుగుతాయని ఆమె తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు 'మై భారత్' పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.