విషాదం.. కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు మండలం చందాపూర్‌కు చెందిన మూర్తి గజేందర్ రెడ్డితో పాటు అతడి కొడుకు రాజేందర్ రెడ్డి ఇవాళ పొలంలో అడవి పందుల నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు రక్షణగా విద్యుత్ వైర్లు కడుతున్నారు. ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్‌కు వైర్ తగలడంతో తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు.