ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన లలితా దేవి

VKB: పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఎ డాక్టర్ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, పేషెంట్ వివరాలు గురించి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. ఈ పరిశీలనలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అధికారుల పర్యటనతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు.