మత్తుపదార్థాలపై కట్టడి.. అధికారులకు ఆదేశాలు
MLG: మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ సూచించారు. జిల్లా నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. యువత, విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండేలా పోలీస్, ఎక్సైజ్, విద్యాశాఖలు నిఘా పెంచాలని తెలిపారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.