తాటిచెట్టుపై నుంచి పడి వృద్ధుడికి గాయాలు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఆకుల కనకయ్య (70) అనే వృద్ధుడు ఇవాళ సాయంత్రం ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుల వృత్తిలో భాగంగా గురువారం సాయంత్రం తాటివనంకు వెళ్లిన కనకయ్య ప్రమాదవశాత్తు జారి పడడం గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.