పీఏపల్లి నూతన తహసీల్దార్ బాధ్యతలు స్వీకరణ

NLG: పెద్దఅడిశర్లపల్లి మండల నూతన తహసీల్దార్‌గా జయశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆమె ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతకుముందు ఇక్కడ విధులు నిర్వహించిన జే.శ్రీనివాసరావు కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. మండలంలోని రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తానని ఈ సందర్బంగా అన్నారు.