పెద్దపప్పూరులో 'రైతన్న మీకోసం' కార్యక్రమం
ATP: పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల టీడీపీ కన్వీనర్ తాతిరెడ్డి లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి రైతులకు సలహా, సూచనలు అందించారు. పెట్టుబడి తగ్గించి దిగుబడి, ఆదాయం పెంచడమే లక్ష్యమని లోకనాథ్ రెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా జమ అయినట్లు ఆయన రైతులకు వివరించారు.