లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఏపీ టూరిజం డైరెక్టర్
ASR: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకటరమేశ్ నాయుడు లబ్దిదారులకు సూచించారు. సోమవారం కొయ్యూరు మండలంలో పర్యటించారు. కూటమి నేతలు చంద్రరావు, శ్రీనివాస్, వెంకటరమణతో కలిసి బూదరాళ్లలో లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడారు.