నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB: బోధన్ డివిజన్‌లోని బోధన్ రూరల్, ఎడపల్లి, రెంజల్ మండలల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డివిజన్ ఏడీఈ నాగేష్ కుమార్ తెలిపారు. బోధన్ రూరల్లోని కల్దుర్కి, సంగెం, రెంజల్ మండలం తాడ్ బిలోలి, ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్‌లో 33/11 kv విద్యుత్తు ఉపకేంద్రాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ స్పష్టం చేశారు.