దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

NLR: దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ ఇందుకూరుపేటలోని శ్రీ కామాక్షితాయి మల్లేశ్వరస్వామివారి ఆలయ ఛైర్మన్‌గా భాస్కర్ నాయుడు 9 మంది సభ్యులతో కమిటీ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.