జిల్లాలో 3.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
PDPL: వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణరావు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ 1,640 కేంద్రాలు వెంటనే ప్రారంభించి, 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ఆదేశించారు. 394 కేంద్రాలతో 3.41 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.