విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

సత్యసాయి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి చిన్నారి మృతిచెందింది. పెనుకొండకు చెందిన జాయేషా(4) ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.