ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నంద్యాల: శ్రీశైలం ఘాట్ రోడ్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నారుట్ల చెంచుగూడానికి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.