సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహణ

సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహణ

KRNL: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలో అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వివిధ మండలాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అందుకున్న ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.