VIDEO: RTC బస్సును ఢీకొట్టిన టిప్పర్
CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. రాళ్లబూదుగూరు వైపు నుంచి కుప్పం వస్తున్న టిప్పర్ శాంతిపురం(M)7వ మైలు మలుపు వద్ద బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టిప్పర్ వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.