నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: నెల్లిమర్ల మండలంలో శనివారం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొండవెలగాడ, సతివాడ, రామతీర్థం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ త్రినాథరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పనులు, నిమిత్తం కొండ వెలగాడ, చంద్రంపేట, LN పురం, తాళ్లపూడి పేట, తుమ్మలపేట, బూరాడ పేట, పారసాం, తదితర గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.