VIDEO: నెల్లూరు సెల్‌ఫోన్ టవర్ నిర్మాణం అడ్డుగింత

NLR: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్ తిప్పరాజు వీధిలో సెల్‌ఫోన్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. టవర్ నిర్మాణం చేపడితే రేడియేషన్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వారు ఆందోళన చేపట్టారు. స్థానిక టీడీపీ నేతల సహకారంతో అడ్డుకున్నారు. టవర్ నిర్మాణానికి కావలసిన సామగ్రిని వెనక్కి పంపేశారు.