'డ్రగ్స్ నిర్మూలనకు మత పెద్దల పిలుపు అభినందనీయం'
GNTR: పొన్నూరు రోడ్డులోని ముస్లిం కాలేజీలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలన, మొబైల్ వాడకం నియంత్రణపై ముస్లిం మత పెద్దలు ఇచ్చిన సందేశాన్ని అభినందించారు. భావి తరాల భవిష్యత్తు కోసం ఇలాంటి సామాజిక మార్పులు ప్రతి ఇంట్లో రావాలని ఆయన పిలుపునిచ్చారు.