మేడేను జయప్రదం చేద్దాం: సీఐటీయూ

MBNR: మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేను ఘనంగా జరుపుకుందామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాములు పిలుపునిచ్చారు. జడ్చర్లలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మే 1న జిల్లాలోని కార్మికవర్గం అంతా ఐక్యంగా కదలి మేడే దీక్షా దినంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.