పిల్లల విద్యా ప్రమాణాలు పెంపొందించాలి: కలెక్టర్

పిల్లల విద్యా ప్రమాణాలు పెంపొందించాలి: కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రంగాపూర్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంగ్లం, తెలుగు, గణితాన్ని సులభంగా నేర్పించాలని, తద్వారా పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని కలెక్టర్ సూచించారు.