VIDEO: తాంసిలో కురిసిన వర్షం.. చల్లబడ్డ వాతావరణం

VIDEO: తాంసిలో కురిసిన వర్షం.. చల్లబడ్డ వాతావరణం

ADB: తాంసి మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తాంసితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వర్షం కురవడంతో వేడిమి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. బలమైన గాలుల కారణంగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.