గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళ్ళులర్పించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు గంపల మంజుల విద్యార్థులకు ఆశ్రమ స్థల దాత, స్వాతంత్ర సమరయోధురాలు పోనక కనకమ్మ జీవిత విశేషాల గురించి వివరించారు.