ప్రతి ఒక్కరూ భగీరథుడిని ఆదర్శంగా తీసుకోవాలి
MBNR: ప్రతి ఒక్కరూ భగీరథుడిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ భగీరథ మహర్షి జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సగరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.