సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన నాయకులు

SRD: జహీరాబాద్ పట్టణంలో 8.02 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పంపిణీ చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జహీరాబాద్, న్యాల్కల్, కోహిర్, ఝరసంగం, మొగుడం పల్లి మండలాల్లోని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, రామలింగారెడ్డి పాల్గొన్నారు.