ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌

ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అణు కేంద్రానికి నష్టం జరగనప్పటికీ, సమీపంలోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడటంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.