భైంసాలో ఎస్పీ గ్రీవెన్స్.. సత్వర పరిష్కారం
NRML: ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షీ టీమ్ కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ వివాదాలను అక్కడే పరిష్కరించారు. నిర్మల్ వెళ్లే దూరాభారం తప్పడంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.