జాతీయ యువజనోత్సవాల్లో ఏయూ విద్యార్థుల ప్రతిభ

జాతీయ యువజనోత్సవాల్లో ఏయూ విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చెన్నైలోని సత్యాంబ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో జరిగిన 39వ అంతర్ విశ్వవిద్యాలయ జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చాటారు. రంగోలి పోటీలో పి. వేలాంగిణి ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ పొందగా, వక్తృత్వ పోటీలో ఇ. వికాస్ కుమార్ నాల్గవ స్థానం దక్కించుకున్నారు.