హుజూర్‌నగర్‌లో SGF పోటీలు

హుజూర్‌నగర్‌లో SGF పోటీలు

SRPT: హుజూర్‌నగర్ మండలంలోని మండల పాఠశాల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) క్రీడలు ఆగస్టు 25, 26 తేదీలలో నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి సైదా నాయక్ తెలిపారు. ఆగస్టు 25న అండర్ -14, అండర్-17 బాలుర విభాగాల పోటీలు, 26న అండర్-14, అండర్-17 బాలికల విభాగాల క్రీడలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలు ఎన్ఎస్పీ క్యాంప్ పాఠశాలలో జరుగుతాయని పేర్కొన్నారు.