'సేంద్రియ ఎరువును తయారు చేయాలి'

'సేంద్రియ ఎరువును తయారు చేయాలి'

JGL: తడి పొడి చెత్తను వేరుగా చేసి సేంద్రియ ఎరువును తయారు చేయాలని, జగిత్యాల డీఎల్‌పీవో సుదర్శన్ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో పారిశుద్ధ్య పనులను డీఎల్‌పీవో సుదర్శన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిత్యం పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల పంచాయతీ అధికారి రామకృష్ణ రాజు పాల్గొన్నారు.